దీపావళికి కొత్త నోములు

తెలంగాణ రాష్ట్ర విద్వత్సభ ఉపాధ్యక్షుడు అయినవోలు అనంతమల్లయ్య శర్మ సిద్ధాంతి

కాజీపేట, అక్టోబర్ 28 : శ్రీ విళంభి నామ సంవత్సరంలో దీపావళి పండుగకు కొత్త నోములు ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర విద్వత్సభ ఉపాధ్యక్షుడు, శ్వేతార్క మూలగణపతి దేవాలయ వ్యవస్థాపకుడు అయినవోలు అనంతమల్లయ్య శర్మ సిద్ధాంతి తెలిపారు. ఈసందర్భంగా ఆయన దేవాలయంలో ఆదివారం విలేకరు లతో మాట్లాడుతూ.. అక్టోబర్ 31 వరకు శుక్రమౌడ్యమీ వెళ్లిపోతుండటంతో ఈ ఏడాది తప్పక దీపావళికి కొత్త నోములు చేసుకోవచ్చునని తెలిపారు. తెలంగాణ విద్వత్సభ ఏర్పాటై పండుగలను నిర్ణయిస్తుంటే, కొంత మంది వ్యక్తులు శాస్త్రం గురించి, చేస్తున్న నిర్ణయాల గురించి సరైన అవగాహన లేక ప్రజలను తికమక పెడుతున్నారన్నారు. గ్రామ ప్రజలకు ఏదైనా సందేహం ఉంటే అక్కడి పురోహి తులు, వేదపండితులు, అర్చకులు తమ తమ ప్రాంతీయ సిద్దాంతులను సంప్ర దిస్తే మంచిదని సూచించారు. శ్వేతార్కలో మాట్లాడుతున్న అయినవోలు అనంత మల్లయ్య శర్మసిద్ధాంతి

 

 

కొత్త నోములు నోముకోవచ్చు • ఐనవోలు అనంతమల్లయ్య శర్మ

కాజీ పేట టౌన్, అక్టోబరు 28: ఈ యేడాది దీపావళికి కొత్త నోములు నోచుకోవచ్చునని శ్రీ భద్రకాళీ దేవాలయ ఆస్థాన సిద్ధాంతి అనంతమల్లయ్య శర్మ స్పష్టం చేశారు. దీపావళి కొత్త నోముల పరంగా సందేహాలు నెలకొన్న నేపథ్యంలో ఆదివారం ఆయన ఒక పత్రికా ప్రకటనను విడుదల చేశారు. అందులో తెలిపిన ప్రకారం.. నవంబర్ 1 బుధవారం ఆశ్వీయుజ అమవాస్య తిథి రాత్రి 8.54 గంటల వరకు, స్వాతీనక్షత్రం రాత్రి 7.56 గంటల వరకు ఉంటుంది. వర్జ్యం రాత్రి 1.36 నుంచి 8.15 గంటల వరకు ఉంటుంది. అక్టోబర్ 31 వరకే శుక్రమౌఢ్యమి వెళ్ళిపోతున్నందున దీపావళి కొత్త నోములు నోచుకోవచ్చు. అమావాస్యలో స్వాతి నక్షత్రం ఉన్న రోజున మౌఢ్యమి లేని సమయంలో కొత్త నోములు చేసుకునే ఆచారం అనాదిగా వస్తోంది. దీపావళి పర్వదినానికి కార్తెల పట్టింపులు లేవు. దేశంలో వర్షపాతాలు, ఎండ తీవ్రత, వాతావరణ అంశాల పరంగా మాత్రమే కార్తెలను పరిగణనలోకి తీసుకుంటారు. ప్రతాదుల విషయంలో వాటిని పరిగణనలోకి తీసుకోరు. శాస్త్రపరంగా విశాఖ కార్తెలో వ్రతాల గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. దీపావళి పర్వదినం, కొత్త నోములకు సంబం ధించి తెలంగాణ విద్వత్సభలో చర్చించి కొత్త నోములను నోచుకోవ చ్చునని నిర్ణయించారు. అందువల్ల విద్వత్సభ నిర్ణయాలను గౌర వించాలని ఆయన ఆ ప్రకటనలో కోరారు

సంతోషం

సంతోషంలో ఉన్నప్పుడే కాదు. ఎలాంటి సమస్యలొచ్చినా సరే ఒకరినొకరై పంచుకొని జీవించడమే నిజమైన సంసార జీవనమవుతుంది.

*అనంతవచనం*