తెలంగాణ గణపతిగా ప్రాచుర్యం పొందిన వరంగల్ జిల్లా కాజిపేటలోని స్వయంభు శ్రీ శ్వేతార్కమూలగణపతి దేవాలయంలో జరుపబడుతున్న శ్రీ దేవీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈ రోజున అమ్మవారిని కాత్యాయని రూపములో అలంకరించి అర్చించడం జరిగింది. ఈ రోజున మూలా నక్షత్రము అయినందున దేవాలయంలో కొలువై ఉన్న శ్రీ సరస్వతి అమ్మవారికి ప్రత్యేక హరిద్ర ఉదకముతో అభిషేకము జరుపబడినది . అయినవోలు సాయికృష్ణ శర్మ, ఆనందశర్మ అభిషేకమును నిర్వహించారు. అనంతరం చిన్న పిల్లల చేత అక్షరాభ్యాసము నిర్వహించడం జరిగింది. అమ్మవారిని ప్రత్యేకముగా అలంకరించడం జరిగింది. ఈరోజు నిత్య సహస్రమోదక హోమము మరియు నిత్య చండీ హోమము జరుపబడినది. బ్రహ్మశ్రీ క్రాంతి శర్మ మరియు అయినవోలు రాధాకృష్ణశర్మ అమ్మవారి పారాయణము చేశారు .. బ్రహ్మశ్రీ మణికంఠ శర్మ ఆధ్వర్యంలో ఈ రోజు పూజా కార్యక్రమాలు జరుప బడినవి . కుమారి సుష్మ సుష్మితలు అలంకరించిన అమ్మవారి రూపము భక్తులను విశేషంగా ఆకర్షించింది .మహతి శర్మ,కళ్యాణి శర్మ,శారదా,సాయి కుమారీ ఆలపించిన మంగళహారతులు భక్తులను మైమరపించాయి…
ఇట్లు
అయినవోలు అనంత మల్లయ్య శర్మ సిద్ధాంతి
దేవాలయ వ్యవస్థాపకుడు