శ్వేతార్కలో ఈ రోజు సరస్వతి మాత పూజలు

తెలంగాణ గణపతిగా ప్రసిద్ధి చెంది 29 దేవతమూర్తుల నిలయమై వరంగల్ జిల్లాలోని కాజిపేట లో స్వయంభు శ్రీశ్వేతార్కగణపతి క్షేత్రమునందు కొలువుదీరిన శ్రీ జ్ఞానముద్ర సరస్వతీ అమ్మవారికి దేవి శరన్నవరాత్రులలో భాగంగా

ఈ రోజు (15-10-2018) సోమవారం రోజున ఉదయం 7గంటలకు పంచామృత,హరిద్రోదక,సహస్రధారభిషేకం జరుగనుంది. ఉదయం9.30 ని||ల నుండి అర్చన,హారతి,విశేష పూజలు,సామూహిక అక్షరాభ్యాసములు,అష్టోత్తర, సహస్రనామ పూజలు జరుగనున్నాయి..

భక్తులు అమ్మవారికి చీరలు, పంచామృతములు,గజమాలలు, పూలు,పూలదండలు,కొబ్బరికాయలు, స్వీట్, విద్యార్థిని విద్యార్థుల కొరకు పుస్తకం, పలకలు,పెన్నులు,ఇత్యాదివి తీసుకొని రాగలరు (అక్షరాభ్యాస పూజ లిస్ట్ కోసం దేవాలయ సమాచార కేంద్రంలో సంప్రదించగలరు)…

భక్తులు పై పూజ సేవలలో పాల్గొను వారు ఒక గంట ముందుగా సంప్రదాయ దుస్తుల్లో దేవాలయానికి రాగలరు… మరిన్ని పూర్తి వివరాలకై 9394810881 నెంబర్ లో సంప్రదించగలరు….

17వ తేదీన కూష్మండ పూజలు అనగా గుమ్మడికాయలకు పూజ మరియు రాత్రి 10గంటలకు కాళరాత్రి చండీహోమము జరుగును. తప్పక రాగలరు.

www.swetharka.org కూష్మండ పూజ సామగ్రి దేవాలయ సమాచార కేంద్రంలో తెలుసుకొనగలరు.లేదా వాట్సాప్ గ్రూపులలో పెట్టడం జరుగుతుంది.
ఇట్లు

దేవాలయమేనేజ్మెంట్

అమ్మా నాన్న లకు ధైర్యంగా ఉంటూ ప్రేమిస్తూ ఉండాలి.అత్తామామలయందు గౌరవంగా ఉండాలి. అన్నల యందు తోడుగా ఉండాలి,తమ్ములయందు బాధ్యతగా ఉండాలి.అక్కాబావలయందు మన్ననతో ఉండాలి. చెల్లె బావలయందు అన్యోన్యంగా ఉండాలి. భార్యభర్తలు ఇంకొకరికి ఆదర్శవంతులుగా ఉండాలి. అమ్మానాన్నలు పిల్లల భవిష్యత్తును గురించి ఆలోచిస్తూ ఉండాలి. గురుభక్తి,దైవబలం కలిగి ఉన్నవారు… అందరిలోనూ మంచివారై ఉంటారు. “”””””””””‘””'”””””””””””””””””””””””””””బాంధవ్యాలు పెంచుకొంటూ పోతుంటే బంధుత్వాలు,స్నేహాలు పెరుగుతూ పోతుంటాయి.*అనంతవచనం*