డబ్బువునోడికి

డబ్బున్నోడికి పెద్దాసుపత్రి

జబ్బున్నోడికి చిన్నాసుపత్రి

జబ్బున్నోడి డబ్బంతా పెద్దాసుపత్రికే వెళ్తుంది.

డబ్బుంటేనే జబ్బుపోతుంది. .

డబ్బుకావాలా..జబ్బు పోవాలా అంటున్న రోజులివి.

*అనంతవచనం*

దీపావళికి కొత్త నోములు

తెలంగాణ రాష్ట్ర విద్వత్సభ ఉపాధ్యక్షుడు అయినవోలు అనంతమల్లయ్య శర్మ సిద్ధాంతి

కాజీపేట, అక్టోబర్ 28 : శ్రీ విళంభి నామ సంవత్సరంలో దీపావళి పండుగకు కొత్త నోములు ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర విద్వత్సభ ఉపాధ్యక్షుడు, శ్వేతార్క మూలగణపతి దేవాలయ వ్యవస్థాపకుడు అయినవోలు అనంతమల్లయ్య శర్మ సిద్ధాంతి తెలిపారు. ఈసందర్భంగా ఆయన దేవాలయంలో ఆదివారం విలేకరు లతో మాట్లాడుతూ.. అక్టోబర్ 31 వరకు శుక్రమౌడ్యమీ వెళ్లిపోతుండటంతో ఈ ఏడాది తప్పక దీపావళికి కొత్త నోములు చేసుకోవచ్చునని తెలిపారు. తెలంగాణ విద్వత్సభ ఏర్పాటై పండుగలను నిర్ణయిస్తుంటే, కొంత మంది వ్యక్తులు శాస్త్రం గురించి, చేస్తున్న నిర్ణయాల గురించి సరైన అవగాహన లేక ప్రజలను తికమక పెడుతున్నారన్నారు. గ్రామ ప్రజలకు ఏదైనా సందేహం ఉంటే అక్కడి పురోహి తులు, వేదపండితులు, అర్చకులు తమ తమ ప్రాంతీయ సిద్దాంతులను సంప్ర దిస్తే మంచిదని సూచించారు. శ్వేతార్కలో మాట్లాడుతున్న అయినవోలు అనంత మల్లయ్య శర్మసిద్ధాంతి

 

 

కొత్త నోములు నోముకోవచ్చు • ఐనవోలు అనంతమల్లయ్య శర్మ

కాజీ పేట టౌన్, అక్టోబరు 28: ఈ యేడాది దీపావళికి కొత్త నోములు నోచుకోవచ్చునని శ్రీ భద్రకాళీ దేవాలయ ఆస్థాన సిద్ధాంతి అనంతమల్లయ్య శర్మ స్పష్టం చేశారు. దీపావళి కొత్త నోముల పరంగా సందేహాలు నెలకొన్న నేపథ్యంలో ఆదివారం ఆయన ఒక పత్రికా ప్రకటనను విడుదల చేశారు. అందులో తెలిపిన ప్రకారం.. నవంబర్ 1 బుధవారం ఆశ్వీయుజ అమవాస్య తిథి రాత్రి 8.54 గంటల వరకు, స్వాతీనక్షత్రం రాత్రి 7.56 గంటల వరకు ఉంటుంది. వర్జ్యం రాత్రి 1.36 నుంచి 8.15 గంటల వరకు ఉంటుంది. అక్టోబర్ 31 వరకే శుక్రమౌఢ్యమి వెళ్ళిపోతున్నందున దీపావళి కొత్త నోములు నోచుకోవచ్చు. అమావాస్యలో స్వాతి నక్షత్రం ఉన్న రోజున మౌఢ్యమి లేని సమయంలో కొత్త నోములు చేసుకునే ఆచారం అనాదిగా వస్తోంది. దీపావళి పర్వదినానికి కార్తెల పట్టింపులు లేవు. దేశంలో వర్షపాతాలు, ఎండ తీవ్రత, వాతావరణ అంశాల పరంగా మాత్రమే కార్తెలను పరిగణనలోకి తీసుకుంటారు. ప్రతాదుల విషయంలో వాటిని పరిగణనలోకి తీసుకోరు. శాస్త్రపరంగా విశాఖ కార్తెలో వ్రతాల గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. దీపావళి పర్వదినం, కొత్త నోములకు సంబం ధించి తెలంగాణ విద్వత్సభలో చర్చించి కొత్త నోములను నోచుకోవ చ్చునని నిర్ణయించారు. అందువల్ల విద్వత్సభ నిర్ణయాలను గౌర వించాలని ఆయన ఆ ప్రకటనలో కోరారు

సంతోషం

సంతోషంలో ఉన్నప్పుడే కాదు. ఎలాంటి సమస్యలొచ్చినా సరే ఒకరినొకరై పంచుకొని జీవించడమే నిజమైన సంసార జీవనమవుతుంది.

*అనంతవచనం*

శ్వేతార్కలో నేత్రపర్వముగా బిల్వదళా, వసంతోత్సవ(గులాలుతో) అభిషేకం

తెలంగాణ గణపతిగా ప్రసిద్ధి చెందిన 29దేవతామూర్తుల దేవాలయ మరియు ప్రత్యేక దంపత్ వాహన సమేత  వరంగల్ జిల్లా కాజిపేటలోని సపరివార సమేత స్వయంభు శ్రీశ్వేతార్కగణపతి క్షేత్రంలో (27-10-18) రోజున సంకటహర చవితిని పురస్కరించుకొని శ్వేతార్కగణపతిస్వామివారికి  సాయంత్రం 5 గంటలకు దుర్వా మరియు లాజ్జ హోమం.మరియు సాయంత్రం 6.30 నిమి|లకు వరంగల్ శ్రీరాజరాజేశ్వరి మాత ఆలయ నిర్వాహకులు మరియు భక్తులచే సేకరించబడిన 180కిలోల గులాలుతో మరియు సహస్ర బిల్వదల పత్రాలతో గణపతికి అభిషేకం చేయడం జరిగింది.  ఐనవోలు రాధాకృష్ణ శర్మ మరియు వరంగల్ శ్రీరాజరాజేశ్వరి దేవాలయ అర్చకులు శ్రీయల్లంభట్ల హర్షశర్మల వేద మంత్రోచ్చారణలో విశేష అభిషేకం జరిగింది.. తదుపరి గకరాది గణపతి అష్టోత్తర, అర్చన,మంత్రపుష్పాలతో,పూజలు జరిపి భక్తులకు హారతి తీర్థప్రసాదాలు వితరణ చేయడమైనది… గులాలుతో అభిషేకము చేయడం వలన కలిగే ఫలితాలను అర్చకులు వివరించారు. అనంతరం భక్తులకు అన్నపూర్ణ భవనంలో భక్తులకు విశేష మహాన్నదానం జరిగింది. కార్తీక మాసోత్సవాలు శివకేశవుల నిలయమైన శ్వేతార్కలో 8నవంబర్ నుండి 7 డిసెంబరు వరకు వివరాలు  www.swetharka.orgలో    ఇట్లు.శ్వేతార్క దేవాలయ మేనేజ్మెంట్

సంపన్నుడి ఆలోచన

సంపన్నుడి ఆలోచనకన్నా సంపాదన తక్కువగా ఉన్నవాడి ఆలోచనే నిర్మాణాత్మకంగా ఉంటుంది.

*అనంతవచనం*

ఎన్ని కష్టాలు వచ్చినా సరే….

ఎన్ని కష్టాలు వచ్చినా సరే.. భగవంతున్ని మరచి పోవొద్దు పైగా నిందించకూడదు. నా మంచి కోసమే జరుగుతుందనే ధైర్యాన్ని తెచ్చుకోవాలి. నీకంతా మంచే జరుగుతుంది.

*అనంతవచనం*

27 అక్టోబర్ సంకష్టహర చతుర్థి గులాలు మరియు బిల్వదలములతో అభిషేకం

స్వయంభూ శ్రీ శ్వేతార్కమూలగణపతి దేవాలయంలో (27-10-18) రోజున సంకటహర చవితిని పురస్కరించుకొని శ్వేతార్క గణపతికి సాయంత్రం 5 గంటలకు దుర్వా హోమం.మరియు సాయంత్రం 6 గంటలకు గులాలుతో మరియు బిల్వదల పత్రాలతో అభిషేకం చేయడం జరుగుతుంది.కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మీ వంతుగా గులాలు&బిల్వదల పత్రాలను తీసుకొని వచ్చి శ్వేతార్క గణపతి అభిషేకానికి పాత్రులు కావలసిందిగా కోరుతున్నాం.                         

ఇట్లు.శ్వేతార్క దేవాలయ మేనేజ్మెంట్

నేటి అనంతవచనం

నీవు సాధించిన విజయం వెనక నీ పెద్దల ఆశీస్సులు,దైవబలం కూడా ఉంటాయి. అది తెలుసుకోక నీవు గర్వ పడుతున్నావు. సంస్కారవంతులు అన్నిటినీ గౌరవిస్తారు .. గర్వించరు.

*అనంతవచనం*

నేటి అనంతవచనం

ఆ దేవుని అనుగ్రహాన్ని పొంది కృతార్థులైనవారు . దేవుడు అడగడని తెలిసినా దేవుని గొప్పతనం గురించి చెప్పాలి. ఆ బాధ్యత మనిషికుండాలి.

అలా కూడా దైవరుణాన్ని తీర్చుకోవచ్చు.

*అనంతవచనం*