Bhattacharya:
ప్ర: మనం ప్రతిరోజూ చేసే పూజలలో సూర్యోదయ సమయంలో ఉన్న తిథిని సంకల్పంలో చెప్పుకునే పద్దతి ఉంది. ఇదే పద్ధతిని ఆయా తిథుల్లో వచ్చే పండుగలకు అనుసరిస్తారా? అంటే సూర్యోదయ సమయాన తిథి ఉన్నరోజునే పండుగ జరుపుకోవాలా?
జ: సూర్యోదయ సమయంలో ఉన్న తిథిని నిత్యం సంకల్పంలో చెప్పుకోవాలి. అందులో సందేహం లేదు. పండుగలలో కూడా అలాగే చెప్పుకునా, కొన్ని పండుగలకు మాత్రం విభిన్న కాలాలు వర్తిస్తాయి. ఉదాహరణకు – మధ్యాహ్నం శుక్ల చవితి (భాద్రపదమాసంలో) ఉన్న రోజునే వినాయక చవితి జరుపుకుంటాం. చంద్రోదయంతో కృష్ణ చవితి ఉన్న రోజున సంకష్టహర చతుర్థి చేస్తాం. మధ్యాహ్న వ్యాపిని ఆయనే చైత్రశుద్ధనవమి శ్రీరామనవమిగానూ, రాత్రి అష్టమి ఉన్న రోజున కృష్ణాష్టమిని, అమావాస్య రాత్రి ఉన్న రోజున దీపావళిని, అర్థరాత్రి చతుర్దశి ఉన్న రోజున శివరాత్రిని, ఇలా నిర్వహిస్తాం. వాటికి సంబంధించిన రోజున ఆ పర్వాన్ని పేర్కొని అర్చనాదులు చేయాలి.—–సామవేదం