శ్వేతార్కాలో వైకుంఠ ఏకాదశి పూజ వివరాలు

వైకుంఠ ఏకాదశి సంధర్బంగా స్వయంభు శ్రీశ్వేతార్కమూలగణపతి దేవాలయంలో కొలువైవున్న శ్రీవేంకటేశ్వరస్వామివారికి ప్రత్యేక పూజలు జరుగును

కార్యక్రమ వివరాలు

ఉదయం 5.20ని౹౹ల అభిషేకం,

ఉదయం 5.45 నుండి తిరుప్పావై సేవ మరియు సామూహిక విష్ణుపారాయణం అనంతరం బాలభోగా నివేదన.

ఉదయం 6.15ని౹౹ల నుండి వైకుంఠ ద్వారాదర్శనం,విశేష అలంకరణ. దర్శన వేళలో భక్తుల హరినామ సంకీర్తన.

ఉదయం 10 గం౹౹లకు పురుషసూక్త, సుదర్శన, నరసింహ మూలమంత్ర,లక్ష్మీకుబేర గణపతి నిత్య సహస్రమోదక హోమములు

పగలు 12గం౹౹లకు మహాన్నదానం(అన్నపూర్ణ భవనంలో)

సాయంత్రం 6.30 భాగవత్గీత మరియు విష్ణు లక్ష్మీ సహస్ర నామ పారాయణములు,పూజ,హారతి,తీర్థప్రసాదా వితరణ.

గమనిక:: పై పూజ,హోమముల్లో పాల్గొన్న భక్తులు గోత్రనామాలకు 151/-(అభిషేక,హోమమ్),351/-(అభిషేక,హోమం,అన్నదానం,ప్రదోషకాలార్చన),551(అభిషేక,హోమములో కూర్చునచో-దంపతులకు మాత్రమే)1116/-అన్ని పూజలలో స్వయంగా కూర్చినవచ్చు(ప్రత్యేక ప్రసాదం ఇవ్వబడును)

ఈ సందర్బంగా.. వైకుంఠ ఏకాదశి నాడు జరిపే ఉత్తర ద్వారా దర్శనం ప్రత్యేకత..
రాక్షసుల బాధలు భరించలేక దేవతలు బ్రహ్మతో సహా వైకుంఠం వెళ్లి ఉత్తర ద్వారం దాటి శ్రీమన్నారాయణుని దర్శించి తమ బాధలను విన్నవించి, స్వామి అనుగ్రహంతో రాక్షస పీడ వదిలించుకున్నారు.
ఉత్తరద్వారం గుండా వెళ్లి వైకుంఠ దర్శనం చేసుకోవడం వల్ల వైకుంఠ ఏకాదశిగాను, దివి నుంచి భువికి దిగి వచ్చిన మూడు కోట్ల దేవతలకు శ్రీ మహావిష్ణువు దర్శనాను గ్రహం ప్రాప్తించడం వల్ల ముక్కోటి ఏకాదశిగాను ఈ పర్వదినం ప్రాశస్త్యాన్ని సంతరించుకుంది. దీన్నే హరివాసరమని, హరిదినమని వైకుంఠ దినమని అంటారు.
ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానమని తెలుస్తుంది. ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశే సంవత్సరంలోని ఇరవై నాలుగు ఏకాదశులలో శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది ఈ వైకుంఠ ఏకాదశి. ఈనాడు “వైకుంఠ ఏకదశీ వ్రతం” ఆచరించిన వారికిశుభఫలితాలుంటాయి. బాధలు అనుభవిస్తున్న పితృదేవతలకు విముక్తి కూడా ఈ రోజే కలుగుతుంది. ఈ రోజుప్రాత: కాలంలో ప్రత్యేక ఉత్తర ద్వార దర్శనం కలిగించుకోవడం మంచిది. సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశానికి ఉత్తర ద్వారం శుభ సంకేతం. దక్షిణాయనంలో మరణించిన పుణ్యాత్ములందరూ వైకుంఠ ద్వారం తెరిచినప్పుడు దాని గుండా స్వర్గంలోనికి ప్రవేశిస్తారని పురాణాలు చెబుతున్నాయి.
అందుకే ఈ పర్వదినాన ఉపవాసముండి శ్రీమహావిష్ణువును ఆరాధించాలి. నిష్ఠతో దీక్షను ఆచరించి రాత్రి జాగరణ చేయాలి. ద్వాదశి రోజున మళ్లీ భగవదారాధన ముగించుకుని పారాయణ చేసి భుజించాలి.
ఉపవసించలేనివారు నెయ్యి, నీరు, పాలు, నువ్వులు, పండ్లు భుజించి ఉండవచ్చును. ముక్కోటి ఏకాదశి నడు చేసే విష్ణు పూజ, గీతా పారాయణం, గోవింద నామ స్మరణం, పురాణ శ్రవణం మోక్ష ప్రాప్తిని కలిగిస్తాయి. ఇంకా ఏకాదశి వ్రతముండే వారికి మరు జన్మంటూ కూడా ఉండదని శాస్త్రం తెలుపుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *