శ్వేతార్కలో మహాశివరాత్రి వేడుకలు


తెలంగాణ గణపతిగా ప్రసిద్ధి చెందిన కాజిపేట స్వయంభు శ్రీశ్వేతార్కగణపతి దేవాలయంలో మహాశివరాత్రి పండుగ పండుగ సందర్భాన్ని పురస్కరించుకొని శ్రీసంతాన నాగలింగేశ్వరస్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకములు జరుపబడును ఉదయం 7గంటలకు మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకము జరుపబడును మరియు ఉదయం 7 గంటల నుండి భక్తులచే సామూహిక అభిషేకములు బిల్వార్చనలు జరుపబడును. పగలు ఒంటిగంటకు ప్రత్యేక అభిషేకము సహస్ర నామార్చన జరుపబడును. సాయంత్రం 6 గంటలకు రుద్రాభిషేకము, రాత్రి 10 గంటల నుండి జాగారం సందర్భంగా ప్రత్యేక సాహితి కదంబ కార్యక్రమము జరుగుతుంది. ఈ కార్యక్రమము తెల్లవారుజామున నాలుగు గంటల వరకు జరుగును.  లింగోద్భవ సమయమునందు శివునికి భక్తులచే స్వయముగా బిల్వదళ పూజలు జరుపబడును. శ్రవణా నక్షత్రం సోమవారం రోజున మహాశివరాత్రి పండుగ రావడం చాలా అరుదుగా చెప్పవచ్చు. దీనిని సిద్ధ శివరాత్రి అని కూడా పిలుస్తారు. దాదాపు 50 సంవత్సరాలకు పైగా ఈ కలయిక వస్తుందని తెలుస్తుంది. కావున ప్రతి ఒక్కరు శివరాత్రి వ్రతాన్ని ఆచరిస్తే చాలా విశేషము. ఈ శివరాత్రికి కొత్తగా ఉపవాసము జాగారం ఆరంభించే వారికి చాలా మంచిది కాబట్టి భక్తులు ఈ విశేషాన్ని ఉపయోగించుకొని శివరాత్రి పండుగను జరుపుకోవాలని తెలియజేస్తున్నాను. ఇట్లు అనంత మల్లయ్య సిద్ధాంతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *