శ్వేతార్కలో ఘనంగా కూర్మజయంతి పూజలు మరియు లక్ష్మీనారాయణ కళ్యాణోత్సవం

కాజీపేటలోని శ్వేతార్కమూలగణపతి దివ్య క్షేత్రంలో కూర్మ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా దేవాలయంలో గత ఆరు సంవత్సరాలుగా ప్రత్యక్ష కుర్మా స్వామికి ప్రత్యేక పూజలు ప్రతి మంగళవారం మరియు పర్వదినముల యందు జరుగుతున్నవి. కూర్మ జయంతి పురస్కరించుకొని ఉదయం ఏడు గంటలకు గణపతి పూజ,పుణ్యాహవాచనం ఆ తదుపరి వెంకటేశ్వరస్వామివారికి మరియు ప్రత్యక్ష కూర్మ దేవునికి పంచామృత,పంచవర్ణములతో విశేష అభిషేకము చేయడమైంది. అనంతరం ప్రత్యేక అలంకరణ హారతి తీర్థప్రసాద వితరణ జరిగింది. లక్ష్మీనారాయణ మూలమంత్ర సహిత నిత్య సహస్రమోదక గణపతి హోమం, సుదర్శన్ మూలమంత్ర హోమాలు జరిగాయి. ఉదయం 11 గంటలకు లక్ష్మీ నారాయణలకు కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. అనంతరం హైదరాబాద్ వాస్తవ్యులు కాశి స్వాతి రమేష్ శర్మ లు భక్తులకు మహా అన్నదానం చేశారు. ఈనాటి కార్యక్రమాలు అయినవోలు అనంతమల్లయ్యశర్మ గారి ప్రత్యక్ష పర్యవేక్షణలో అయినవోలు రాధాకృష్ణశర్మ మరియు యల్లంభట్ల క్రాంతి కుమార్ శర్మ, యల్లంభట్ల రవీందర్ శర్మ,దయాకర్ స్వామిల నిర్వహణలో అభిషేక,పూజ,హోమ,కళ్యాణోత్సవ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *