స్వయంభు శ్రీశ్వేతార్కమూలగణపతి దేవాలయంలో దసరా పండుగ రోజున ప్రత్యేక సాయిబాబా పూజలు జరుపబడినవి. శ్రీ షిరిడి సాయిబాబా సమాధి చెంది ఈ దసరా పండుగకు 100 సంవత్సరములు పూర్తయిన సందర్భంగా శతాబ్ది సమాధి పూజలు జరుపబడినవి. ఉదయం ఏడు గంటలకు పాలాభిషేకము మరియు 11గంటలకు కోవా పదార్థ నివేదన. 12 గంటలకు అన్నదానము సాయంత్రం ఏడు గంటలకు ప్రత్యేక అర్చన హారతి తీర్థప్రసాద వితరణ చేయబడినది. రాత్రి ఎనిమిది గంటలకు దేవాలయ భజన బృందం వారిచే భజన జరుపబడినది. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు . సాయిబాబా సమాధి చెందిన సందర్భాన్ని పురస్కరించుకొని విశేష అన్నదానమును జరుపబడింది.
ఇట్లు
ఐనవోలు అనంత మల్లయ్య శర్మ సిద్ధాంతి