రంగనాథునిగా దర్శనమిచ్చిన శ్వేతార్కగణపతి — వైభవంగా గోదారంగనాథుని కళ్యాణం

కాజీపేట శ్వేతార్కగణపతి దేవాలయంలో కొలువై ఉన్న శ్రీవేంకటేశ్వర ఆలయంలో ఈరోజు భోగి పండుగను పురస్కరించుకొని గోదారంగనాథ కళ్యాణంను భక్తులు అత్యంత కడురమణీయంగా,వేదోక్తముగనిర్వహించారు.
ఉ.7 గంటలకు శ్రీవేంకటేశ్వరస్వామివారికి పంచామృత అభిషేకమును 58 లీ. పాలతో సుగంధద్రవ్యాలతో హరిస్వామి,ఆనంద్ శర్మలు అభిషేకము జరుపబడింది. అనంతరం దేవాలయ వైదిక కార్యక్రమ నిర్వాహకులు ఐనవోలు రాధాకృష్ణ శర్మ మరియు దేవాలయ వైష్ణవ పూజల నిర్వాహకులు టంటందయాకరస్వామి పరిపాలన నిర్వాహకులు సాయికృష్ణశర్మ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా కళ్యాణోత్సవమును నిర్వహించారు . ఈ పూజలో పోలీస్ అధికారి ఎల్.రమేష్ కుమార్, స్థానికకార్పొరేటర్ రమారవీందర్,రాజన్ బాబు,సాంబమూర్తి, యాదగిరి,తదితరులు పాల్గొన్నారు.

రంగనాథునిగా దర్శనమిచ్చిన శ్వేతార్కగణపతి

భౌమ చతుర్థి, భోగిని పురస్కరించుకొని దేవాలయంలో శ్వేతార్కగణపతికి ప్రత్యేక పూజలు జరుపబడినవి. ఈ సందర్భంగా శ్రీస్వామివారిని ప్రత్యేకముగా వైష్ణవ పద్ధతిలో రంగనాథునిగా అలంకరించి పూజలు జరుపబడినవి. పూజల అనంతరం భక్తులకు అన్నదానం జరిగింది.

— ఇట్లు నిర్వాహకులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *