చదువులకు ఆదిదేవుడు హయగ్రీవ స్వామి వారికి ప్రత్యేక పూజలు

ివకేశవ సన్నిధానమైన తెలంగాణ గణపతిగా భాసిల్లుతున్న కాజీపేట శ్వేతార్కమూలగణపతి స్వామివారి దివ్య క్షేత్రములో కొలువై ఉన్న హాయగ్రీవ స్వామివారికి హాయగ్రీవ జయంతి పురస్కరించుకుని శ్రావణ పౌర్ణమి సందర్భంగా ఉదయం నుండి విశేష పూజలు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఉదయం ఏడు గంటలకు పంచామృత విశేష అభిషేకం జరిగింది. ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు వారి యొక్క విద్య అభివృద్ధి వారి యొక్క మేధస్సు సన్మార్గంలో ధర్మసంస్థాపణకై అభివృద్ధిని కాంక్షిస్తూ ఉదయం 10 గంటలకు అయినవోలు రాధాకృష్ణశర్మ నేతృత్వంలో విశేష హోమ కార్యక్రమాలు జరిగాయి. ఆదిదేవుడు చదువులకు ఆదిదేవతాః మూర్తిగా హయగ్రీవ స్వామివారు వేదాల పరిరక్షణ, ధర్మ సంస్థాపన కొరకు వేదాలను, ఉపనిషత్తులను రక్షించి అందరికీ కూడా అందించిన జ్ఞాన సంపద కథలను గుర్తుతెచ్చుకుంటూ అందరికీ కూడా మేధస్సు అభివృద్ధి చెందుతూ వారు చేసే టువంటి అన్ని కార్యక్రమాలలో ధర్మస్థాపన ధర్మ పరిరక్షణకై ప్రతి కార్యక్రమం కూడా ఉండాలని కాంక్షిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించడమైనది. అయినవోలు సాయికృష్ణ శర్మ నేతృత్వంలో ప్రత్యేకంగా విద్యార్థులతో పూజలు జరిపారు. సరస్వతి మాత గురువైన హయగ్రీవస్వామివారి సన్నిధిలో జరిగిన పూజలలో అనేక మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *