ఏకాదశి మర్నాడు ఉసిరికాయలు ఎందుకు తినాలి?

వైకుంఠ ఏకాదశినాడు ముఖ్యంగా ఉపవాసము చేయడం, ద్వాదశినాడు
అవిసి కూరను, ఉసిరికాయలను తినడం
ఎందుకో తెలుసా?

చంద్రుడు భూమిని చుట్టి రావడానికి ఇరవై తొమ్మిదిన్నర రోజులు అవుతున్నాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క తిధి (phase of moon) అనబడే చాంద్రమాసంలో 30 తిధులు వున్నాయి. అమావాస్య నుండి పౌర్ణమి వరకు గల 15 తిధులను శుక్ల పక్షమని
పౌర్ణమి నుండి అమావాస్య వరకు గల తిధులను బహుళ పక్షమని (కృష్ణ పక్షమి)
అని అంటారు.

అమావాస్య నాడు సూర్య చంద్రులు ఒకే సమయంలో ఉదయించి, ఒకే సమయంలో అస్తమిస్తారు. అక్కడ నుండి ఒక్కొక్క రోజు
12 డిగ్రీల చొప్పున చంద్రుడు, సూర్యుని నుండి దూరమౌతాడు. నాలుగవ రోజు అంటే
చవితి నాడు చంద్రుడు సూర్యుని నుండి 37 డిగ్రీలు మొదలు 48 డిగ్రీలు వెనుక బడతాడు.
పదకొండవ రోజు ఏకాదశి నాడు సూర్యుని నుండి 134 డిగ్రీలు వెనుక వున్నట్టు. పౌర్ణమినాడు సూర్యుని నుండి 180 డిగ్రీలు వుంటుంది. పైన చెప్పిన రోజుల్లో సూర్యుని
నుండి చంద్రుడు దూరముగా వున్నందున
భూమ్యాకర్షణ శక్తి అధికమవుతున్నది.
ఆసమయంలో ఎప్పుడూ భోజనం చేసినట్లు చేస్తే జీర్ణక్రియ సరిగా వుండదు. అందు వలన ఆ కాలంలో శాస్త్ర పండితులు ఉపవాసం
చేయాలని చెప్పారు.

వైకుంఠ ఏకాదశి రోజున చంద్రుడు సూర్యునికి
135 డిగ్రీలు వెనుకబడి వుంటాడు. ఆనాడు సూర్యుని మార్గానికి దక్షిణాన దూరంగా వుంటాడు. ఆనాడు కూడా భూమ్యాకర్షణ శక్తి
అధికమైనందున ఉపవాసం చేయాలి అని
తెలిపారు.

ఏకాదశినాడు ఉపవాస వ్రతం చేసినందు వలన మొదటి పదిరోజులు భుజించిన ఆహారంలో చేరిన మలినాలు కరిగి బయటికి పోతాయి. 11 వ రోజు ఏకాదశినాడు కడుపు శుభ్రపడుతుంది. ఆ నాడు జీర్ణక్రియకు విశ్రాంతి లభిస్తుంది. పిదప మనకు విటమిన్లు అవసరమవుతున్నాయి.
ముఖ్యంగా విటమిన్ ‘ఏ’ విటమిన్ ‘సి’ అవసర పడతాయి. అందు వలన ద్వాదశినాడు ‘ఏ’ విటమిన్ అధికంగా కలిగిన అవిసి కూరను,
‘సి’ విటమిన్ అధికంగా కలిగిన ఉసిరికాయలను ఆహారంలో చేర్చుకుంటున్నాము.

నిత్యం మనం సూర్య నమస్కారాలు చేసి
నెలకి ఒక సారి ఏకాదశి నాడు ఉపవాసం చేయడం వలన, నేత్ర దృష్టి కి దేహానికి
ఆరోగ్యం లభిస్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *